ఎన్‎వైకేఎస్‎లో వలంటీర్ పోస్టులు

హైదరాబాద్: కేంద్ర యువజన, క్రీడా శాఖ పరిధిలో స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్న నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్‎వైకేఎస్ ) వలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ యూత్ కార్ప్స్ స్కీమ్‎లో భాగంగా 10వ తరగతి అర్హతతో దేశవ్యాప్తంగా 13,206 వలంటీర్లను నియమిస్తున్నది. 2021- 22 ఆర్థిక సంవత్సరం కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నది. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.

దేశవ్యాప్తంగా 623 కేంద్రాల్లో ఒక్కో బ్లాక్‎కు ఇద్దరు చొప్పున వలంటీర్లను నియమిస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ రెండు మండలాలకు ఒక వలంటీర్ ఉంటారు. వీరితో పాటు ప్రతీ కేంద్రంలో కంప్యూటర్, డాక్యుమెంటేషన్ పని కోసం ఇద్దరు వాలంటీర్లు ఉంటారు. ఎంపికైన అభ్యర్థులు ఏప్రిల్ 1న విధుల్లో చేరాలి.

మొత్తం పోస్టులు : 13,206

అర్హతలు : 10వ తరగతిలో ఉత్తీర్ణులవ్వాలి. 2021 ఏప్రిల్ 1 నాటికి 18 నుంచి 29 ఏండ్లలోపు ఉండాలి. ఎంపికైనవారికి రూ.5000 గౌరవ వేతనంగా చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ : ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆన్‎లైన్‎లో లేదా ఆఫ్‎లైన్‎లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు ఆధార్ కార్డు, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ తప్పనిసరిగా అప్‎లోడ్ చేడాలి.

దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 20

ఇటర్వ్యూలు : ఫిబ్రవరి 25 నుంచి మార్చి 8 వరకు

ఇంటర్వ్యూ ఫలితాలు : మార్చి 15

వెబ్‎సైట్ : https://nyks.nic.in/