సీఎం యాద్రాద్రి పనుల పరిశీలన

ads

హైదరాబాద్: పంచనారసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో నేడు ఆలయ అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదగిరిగుట్టపైకి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. నేరుగా బాలాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్‎కు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందచేశారు. అనంతరం స్థపతి వేలు, ఆనంద్ సాయి, యాడా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అధికారుల పనులపై దిశా నిర్దేశం చేశారు. గతంలో తన ఆదేశాలతో ఏ మేరకు పనులు జరిగాయి, ఇంకా అసంపూర్తిగా ఉన్న వాటిపై ఆరా తీశారు.

కొండదిగువన పచ్చదనం పెంపు, కాలినడకన నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. ఆలయ మాడవీధుల్లో సుందరీకరణ, విద్యుద్దీపాలు ఏర్పాటు చేసేందుకు స్తంభాలకు సంబంధించిన వివరాలు ఆనంద్ సాయి సీఎంకు వివరించారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో సంబంధించిన వివరాలు ఆనంద్ సాయి సీఎంకు వివరించారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో కలియదిగారు. మాఢ వీధులు, ప్రాకార మండపాల దర్శన సముదాయాలను, బ్రహ్మోత్సవం మండపాన్ని , తూర్పు రాజగురం వద్ద క్యూలైన్లను పరిశీలించారు. క్యూలైన్లలో కొన్ని మార్పులు చేయాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. గత యేడాది సెప్టెంబర్ 13న యాదాద్రికి వచ్చిన సీఎం కేసీఆర్ , 5నెలల అనంతరం మళ్లీ క్షేత్రంలో పర్యటిస్తున్నారు.

లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయం పున:ప్రారంభం ఘనంగా నిర్వహించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఈ మేరకు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయించేందుకు యాద్రాద్రిలో పర్యటిస్తున్నారు. రూ1200 కోట్లతో పున: నిర్మాణ పనులు 2016, అక్టోబర్‎లో శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు సుమారు రూ.850 కోట్లు వెచ్చించినట్లు యాడా అధికారులు పేర్కొన్నారు. పూర్తిగా కృష్ణ శిలతో నిర్మించిన ఆలయం అద్భుత గోపురాలు, ప్రాకారాలు, దశావతారాలు, ఆళ్వారాలు, శిల్పాలతో అలరాలుతోంది.