ఓబుళాపురం కేసు వాయిదా

హైదరాబాద్​: ఓబుళాపురం గనుల కేసు విచారణను ఈ నెల 9కి వాయిదా వేస్తూ సీబీఐ కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. అలాగే ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటరు దాఖలుకు సీబీఐకి చివరి అవకాశం ఇచ్చింది. డిశ్చార్జ్ పిటిషన్ పై ఈ నెల 9లోగా కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. జగన్​ ఆస్తుల కేసులో పెన్నా సిమెంట్స్​ ఛార్జ్​షీట్​పై కోర్టులో వాదన కొనసాగింది.