విమాన ప్రమాదంలో ఎవరెవరున్నారంటే ?

విమాన ప్రమాదంలో ఎవరెవరున్నారంటే ?

వరంగల్ టైమ్స్, అహ్మదాబాద్‌ : గుజరాత్‌ అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి 242 మందితో లండన్ లోని గాట్విక్ ఎయిర్పోర్ట్ కు బయలుదేరింది. ఎయిరిండియా AI 171 విమానం మధ్యాహ్నం 1.17 నిమిషాలకు టేకాఫ్ తీసుకుని 2 నిమిషాల్లోనే మేఘానిలోని గుజ్సెల్ విమానాశ్రయ సమీపంలో బీజే మెడికల్‌ కాలేజీపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారంతా కాలి బూడిదయ్యారు, కాలిన గాయాలతో నిర్జీవులయ్యారు.

వీరిలో 20 మందికి పైగా మెడికోలు మృతి చెందారు. విమానంలో 12 మంది సిబ్బంది సహా 242మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. 242 ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53మంది బ్రిటన్ వాసులు, ఒక కెనడియన్‌, ఏడుగురు పోర్చుగల్ వాసులున్నారు. విమానంలో ఇద్దరు శిశువులు సహా 13 మంది చిన్నారులున్నారు. విమానంలో మరణించిన వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్‌రూపానీ కూడా ఉన్నారు.

ఇంకా ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 90 మంది చొప్పున మూడు బృందాలుగా బీఎస్ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదం కారణంగా అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్ సమీపంలో పలు భవనాలు ధ్వంసం అయ్యాయి.అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్ మూసివేశారు. అంతేకాకుండా ఎయిరిండియా హెల్ప్‌లైన్‌ నెంబర్ 1800 5691 444 కు సంప్రదించాల్సిందిగా తెలిపింది.