హంగామా లేకుండా ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ

టోక్యో : టోక్యో ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకలు శుక్రవారం జరుగనున్నాయి. ఈ సారి ఓపెనింగ్ సెర్మనీ చాలా సాదాసీదాగా జరుగనున్నది. కరోనా ఆంక్షల నేపథ్యంలో ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం లేదు. ఎటువంటి దగధగలు, హంగామా ఉండదని నిర్వహకులు చెప్పారు. చాలా సీరియస్ అంశాలతో కళాత్మకంగా ఆరంభ వేడుకలు నిర్వహించనున్నారు. సామూహిక డ్యాన్సర్లు, లైట్ షోలు లేకుండానే ఓపెనింగ్ సెర్మనీ ఉంటుందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మార్కో బాలిచ్ తెలిపారు. కానీ జపనీస్ కళాకృతులు మాత్రం ఆ సెర్మనీలో ఆకట్టుకుంటాయన్నారు.

ads

ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగినట్లుగా ప్రారంభోత్సవ వేడుకను రూపుదిద్దినట్లు ఆయన వెల్లడించారు. 2016 లో జరిగిన రియో వేడుకలకు ఆయనే ఇంచార్జీగా ఉన్నారు. కరోనా వల్ల ఇప్పటికే ఈ క్రీడలను యేడాది పాటు వాయిదా వేసి నిర్వహిస్తున్నారు. ఇక ఈ సారి ప్రేక్షకులు లేకుండానే ఆరంభ వేడుక ఉంటుంది. ఖాళీ స్టేడియంలో అథ్లెట్లు పోటీపడనున్నారు. స్వల్ప సంఖ్యలో టీం పరేడ్ నిర్వహించనున్నారు. కేవలం అథ్లెట్లు మాత్రమే ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొనే రీతిలో ఆ ఈవెంట్ ను డిజైన్ చేశారు.