మాతృమూర్తులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

హైదరాబాద్ : అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పది, ఎంతో స్వచ్ఛమైనదన్నారు. ఓర్పు , సహనం, త్యాగం, ప్రేమ వంటి ఎన్నో సుగుణాలను మనం తల్లి నుంచే నేర్చుకుంటామన్నారు. ఒక మనిషి ఎదుగుదలకు మాతృమూర్తి పాత్ర ఎంతో కీలకమని సీఎం తెలిపారు. మహిళలు, మాతృమూర్తుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలుపరుస్తున్న పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు సీఎం పేర్కొన్నారు.

ads