గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు!

ఇస్లామాబాద్ : ఇండియా, పాకిస్థాన్ సిరీస్ అంటే చాలు క్రికెట్ అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు. పైగా ఇండియా, పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ ఉందంటే చాలు ఎక్కడా లేని క్రేజ్ ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే గత కొన్నాళ్లుగా రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రభావం క్రికెట్‎పైనా పడింది. అప్పుడప్పుడూ ఐసీసీ టోర్నీలో ఆడటమే తప్ప రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరుగడం లేదు. అయితే చాలా యేండ్లుగా ఈ సిరీస్ కోసం ఎదురు చేస్తున్న ఇండోపాక్ క్రికెట్ అభిమానులకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

ads

ఈ సంవత్సరం చివరలో ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ 20 సిరీస్ జరుగనున్నట్లు పీసీబీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఈ చారిత్రక సిరీస్ కోసం సిద్ధంగా ఉండాలని తమకు ఆదేశాలు వచ్చినట్లు ఆయన చెప్పడం గమనార్హం. ఈ వార్తను అక్కడి మీడియా ప్రముఖంగా చూపించింది. అయితే దీనిపై పీసీబీ, బీసీసీఐ మధ్య చర్చలు మాత్రం ఇంత వరకూ జరుగలేదని ఆ అధికారి చెప్పారు. ఒకవేళ ఈ సిరీస్ అనుకున్నట్లుగా జరిగితే ఇండియన్ టీం పాకిస్థాన్ కు రావాల్సి ఉంటుందని పీసీబీ వర్గాలు తెలిపాయి. చివరి సారి ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగినప్పుడు పాకిస్థాన్ టీం ఇండియాకు వచ్చింది. చివరిసారి ఈ రెండు దేశాల మధ్య 2012-13 లో జరిగింది.. గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు!
ఇస్లామాబాద్ : ఇండియా, పాకిస్థాన్ సిరీస్ అంటే చాలు క్రికెట్ అభిమానుల ఆనందానికి హద్దులే ఉండవు. పైగా ఇండియా, పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ ఉందంటే చాలు ఎక్కడా లేని క్రేజ్ ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే గత కొన్నాళ్లుగా రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రభావం క్రికెట్‎పైనా పడింది. అప్పుడప్పుడూ ఐసీసీ టోర్నీలో ఆడటమే తప్ప రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరుగడం లేదు. అయితే చాలా యేండ్లుగా ఈ సిరీస్ కోసం ఎదురు చేస్తున్న ఇండోపాక్ క్రికెట్ అభిమానులకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

ఈ సంవత్సరం చివరలో ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ 20 సిరీస్ జరుగనున్నట్లు పీసీబీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఈ చారిత్రక సిరీస్ కోసం సిద్ధంగా ఉండాలని తమకు ఆదేశాలు వచ్చినట్లు ఆయన చెప్పడం గమనార్హం. ఈ వార్తను అక్కడి మీడియా ప్రముఖంగా చూపించింది. అయితే దీనిపై పీసీబీ, బీసీసీఐ మధ్య చర్చలు మాత్రం ఇంత వరకూ జరుగలేదని ఆ అధికారి చెప్పారు. ఒకవేళ ఈ సిరీస్ అనుకున్నట్లుగా జరిగితే ఇండియన్ టీం పాకిస్థాన్ కు రావాల్సి ఉంటుందని పీసీబీ వర్గాలు తెలిపాయి. చివరి సారి ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగినప్పుడు పాకిస్థాన్ టీం ఇండియాకు వచ్చింది. చివరిసారి ఈ రెండు దేశాల మధ్య 2012-13 లో జరిగింది.