పల్లాను పరామర్శించిన కేసీఆర్

కేసీఆర్ ఫాం హౌస్ లో కాలుజారి పడ్డ పల్లా

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. ఎర్రవెల్లి ఫాంహౌస్ లో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డ పల్లా రాజేశ్వర్ రెడ్డి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బీఆర్కే భవన్ లో కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్ నేరుగా సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలివచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పల్లాను ఆయన పరామర్శించారు.

చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పల్లాను పరామర్శించిన వారిలో కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, సంతోెష్ , వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత తదితరులు ఉన్నారు.

ఉదయం మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ నేలు ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లో కేసీఆర్ ను కలిసారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డారు.