నామినేషన్ వేసిన పల్లా

నల్లగొండ జిల్లా : ఉమ్మడి నల్గొండ -ఖమ్మం- వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నల్లగొండలో భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందచేశారు. పల్లా నామినేషన్ కి ముందు టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ , ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ , ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, సైదిరెడ్డి, ధర్మారెడ్డి, రాజయ్య, శంకర్ నాయక్, పార్టీ నేతలు పాల్గొన్నారు.