తపాలా కార్యాలయాల్లో నేటి నుంచి పాస్‌పోర్టు సేవలు

హైదరాబాద్‌ : తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టు సేవలు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయని సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి బాలయ్య వెల్లడించారు. కరోనా దృష్ట్యా 14 తపాలా కార్యాలయాలతో పాటు.. 5 ప్రధాన పాస్‌పోర్టు కేంద్రాల్లో సేవలను గతంలో నిలిపేశారు. అనంతరం ఈనెల 1 నుంచి బేగంపేట, అమీర్‌పేట, టోలీచౌకి, నిజామాబాద్‌, కరీంనగర్‌లలో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా పగటిపూట లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మంచిర్యాల, మహబూబాబాద్‌, కామారెడ్డి, వికారాబాద్‌, వనపర్తి, మేడ్చల్‌ తపాలా కార్యాలయాల్లో మళ్లీ పాస్‌పోర్టు సేవలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

ads