విద్యుత్‎ అంతరాయంతో పేషంట్ మృతి

వరంగల్ అర్బన్ జిల్లా : ప్రభుత్వాసుపత్రిలో విద్యుత్ అంతరాయం ఓ ప్రాణాన్ని తీసింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో వెంటిలేటర్లు పని చేయక ఓ పేషంట్ చనిపోయాడు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురం మండలానికి చెందిన గాంధీ అనే కొవిడ్ పేషెంట్ గత 25 రోజుల క్రితం కరోనా వైరస్ సోకి ఎంజిఎంలో చేరాడు. ఐతే ఈ రోజు ఉదయం విద్యుత్‎కు అంతరాయం కలగడంతో మెషిన్ పనిచేయక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. పరిస్థితి విషమించి గాంధీ మృతి చెందాడు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే గాంధీ చనిపోయాడని కుటుంబసభ్యులు, బంధువులు తెలిపారు.

ads