బలవంతంగా వ్యభిచారం..!

థానె : మహిళలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని చెర నుంచి ఇద్దరు మహిళలను విడిపించారు. మహారాష్ట్రలోని థానె జిల్లాలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి తలావోపాలి ఏరియాలో ఓ వ్యక్తి ఇద్దరు మహిళలతో కలిసి వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డగించారు. వారిని విచారించగా మహిళలతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది. దాంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను అదే ప్రాంతానికి చెందిన శివకాంత్ రమేష్ సింగ్ ( 36) గా గుర్తించారు. సంబంధిత సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.