తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ : వినియోగదారులకు చుక్కలు చూపించిన పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు కూడా పెట్రో ధరలను స్వల్పంగా తగ్గించాయి. నిన్న లీటర్ పెట్రోల్ 18 పైసలు, డీజిల్ పై 17 పైసలు తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా దేశరాజధానిలో పెట్రోల్ పై 21 పైసలు, డీజిల్ పై 20 పైసల చొప్పున తగ్గించాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.78, డీజిల్ రూ.81.10 కి పడిపోయాయి. అదేవిధంగా ముంబైలో పెట్రోల్ రూ.97.19, డీజిల్ రూ.88.20 గా ఉన్నాయి. ఇక చెన్నైలో పెట్రోల్ రూ.92.77, డీజిల్ రూ.86.10, కోల్ కతాలో రూ.90.98, డీజిల్ రూ.83.98, బెంగళూరులో పెట్రోల్ రూ.94.04, డీజిల్ రూ.86.21గా ఉంది.

ads

ఇక హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. నగరంలో లీటర్ పెట్రోల్ రూ.94.61, డీజిల్ రూ.88.67గా ఉన్నాయి. కరీంనగర్ లో పెట్రోల్ రూ.94.48, డీజిల్ రూ.88.55 గా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నగరాలైన విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.24, డీజిల్ రూ.90.76గా ఉండగా, విశాఖపట్టణంలో పెట్రోల్ రూ.97.24, డీజిల్ రూ.90.76గా ఉంది. గత యేడాది మార్చి 16 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం తొలిసారి. ఏడాది కాలంగా ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, దేశంలో పెట్రోల్ పై రూ.21.58, డీజిల్‎పై రూ.19.18 పెరిగాయి.