రూ.100 దాటిన పెట్రోల్ ధర

జైపూర్: రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానంటుతున్నాయి. నేడు లీటర్ ధరపై 25 పైసలు పెరిగాయి. దీంతో రాజస్థాన్ లో తొలిసారి లీటర్ పెట్రోల్ ధర ఏకంగా వంద దాటింది. శ్రీ గంగానగర్ పట్టణంలో నేడు లీటర్ పెట్రోల్‎ను 100.13 కు అమ్మారు. వరుసగా తొమ్మిదో రోజు ధరలు పెరిగాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో బ్రాండెడ్ పెట్రోల్ వంద మార్క్‎ను దాటింది.

దేశంలో పెట్రోల్‎పై అత్యధిక స్థాయిలో వ్యాట్ వసూల్ చేస్తున్న రాష్ట్రం రాజస్థాన్. బుధవారం ధరలు పెరిగిన దానిని బట్టి, ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 89.54గా, డీజిల్ 79.95గా ఉంది. ముంబై లీటరు పెట్రోల్ ధర రూ.96కాగా, డీజిల్ ధర రూ.86.98గా ఉంది.