తొలి ప్రయత్నంగా పిజ్జా కార్నర్

ములుగు జిల్లా : హైదరాబాద్‎లోనే కాకుండా మారుమూల జిల్లా అయిన ములుగు జిల్లాలో కూడా పిజ్జా దొరుకుతుందని నవ భారత మండల సమాఖ్య ములుగు వారు నిరూపించారు. మహిళలు అన్నిరంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పిజ్జా కార్నర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు పిజ్జా డెలివరీ ఫోన్ నెంబర్ 7702027826 ద్వారా కూడా డోర్ డెలివరీ చేయబడుతున్నదని అదనపు కలెక్టర్ అన్నారు. ఇదే స్ఫూర్తితో మండలాల వారీగా కూడా స్థాపించాలని, మహిళా సంఘాల ద్వారా జీవనోపాధికై ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. గతంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 3లక్షల 50వేలు రుణం అందించి వారికి అన్నపూర్ణ క్యాంటీన్ ను ఏర్పాటు చేయించడం జరిగిందని డి ఆర్ డి ఓ పిడి పారిజాతం అన్నారు. ప్రస్తుతం వారికి 1లక్ష రూపాయల అదనపు రుణం కల్పించి పిజ్జా కార్నర్ షాపులను ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు.

రాష్ట్రంలోనే తొలిప్రయత్నంగా ములుగు జిల్లాలో మొట్టమొదటి పిజ్జా కార్నర్ అందులోనూ దీనిని మహిళా సంఘ సభ్యులచేత నిర్వహించబడటం జరుగుతుందని ఆమె తెలిపారు. ములుగు జిల్లా ప్రజలకు స్వచ్చమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో మహిళా సంఘాలచే ఈ క్యాంటీన్, పిజ్జా కార్నర్‎ను ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో రమాదేవి, జడ్పీ సీఈఓ ప్రసూనరాణి, ఎంఆర్ఓ సత్యనారాయణ స్వామి, శ్రీనిధి మేనేజర్ అరుణ్ సింగ్, ఏపిడి శ్రీనివాస్, డిపిఎం లీలాకుమారి, ఏపిఎం వేణుగోపాల రావ్, సిబ్బంది మరియు మహిళలు పాల్గొన్నారు.