‘ప్లే బాక్’ రిలీజ్​ డేట్​ ఖరారు

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా దర్శకుడు సుకుమార్ రూపొందించిన చిత్రం వన్ నేనొక్కడినే ఈ చిత్రాన్ని ఇప్పటికీ కూడా టాలీవుడ్ లో మోస్ట్ ఇంటెలిజెంట్ స్క్రిప్ట్ గా పరిగణిస్తున్నారు. అయితే అలాంటి అద్భుతమైన కథ ను ప్రేక్షకులకు అందించిన రచయిత హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో రాబోతున్న సినిమా “ప్లేబాక్”, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథా, కథనం తో వస్తున్న ప్లేబాక్ అన్నీ కార్యక్రమాలను ముగించుకుని మార్చి 5 వ తేదీన థియేటర్ల లో విడుదలకు సిద్ధమవుతోంది.

అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇది సరికొత్త కథ అని చెబుతోంది టీం. క్రాస్ టైం కనెక్షన్ మీద ఇప్పటివరకు ఏ చిత్రం రాలేదని కచ్చితంగా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు నూతన కథా వస్తువు పరిచయం అవుతుందని అంటుంది ప్లేబాక్ టీం. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై తెరకెక్కిన ఈ చిత్రం లో హుషారు సినిమా ఫేమ్ దినేష్ తేజ్ , మల్లేశం సినిమా ఫేమ్ అనన్య నాగళ్ల హీరో హీరోయిన్ లుగా నటించారు . అర్జున్ కళ్యాణ్ , స్పందన , మూర్తి , టీఎన్ ఆర్ , చక్రపాణి , అశోక్ వర్ధన్, కార్తికేయ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన హరి ప్రసాద్ జక్కా ఇంతకుముందు వన్ నేనొక్కడినే కి కథను ఇవ్వడం తో పాటుగా , 100% లవ్ చిత్రానికి స్క్రీన్​ప్లే ను అందించారు , అలాగే సుకుమార్ రైటింగ్స్ లో దర్శకుడు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు .

సంగీతం : కమ్రన్
సినిమాటోగ్రఫీ : బుజ్జి కే
ఎడిటర్: నాగేశ్వర రెడ్డి బొంతల
విడుదల తేది – మార్చ్ 5 , 2021