కరోనా టీకా వేయించుకున్న ప్రధాని

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ కరోనా టీకా వేయించుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‎లో కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. అనంతరం కరోనాపై వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ప్రధాని కొనియాడారు. ‘ఎయిమ్స్‎లో కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి వైద్యులు, శాస్త్రవేత్తలు వేగంగా చేస్తున్న కృషి ప్రశంసనీయమైంది. అర్హలులైన ప్రతీ ఒక్కరు కొవిడ్ టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మనమంతా సమిష్టి కృషితో భారత్‎ను కరోనా రహిత దేశంగా మారుద్దాం’ అని అన్నారు. దేశీయంగా తయారైన భారత్ బయోటెక్‎కు చెందిన కొవాగ్జిన్ టీకాను ప్రధాని వేయించుకున్నారు. ఎయిమ్స్ సిస్టర్ పి. నివేదా ప్రధానికి సిరంజీ ద్వారా టీకా ఇచ్చారు.

ads