7న అసోంలో ప్రధాని టూర్


గువాహటి : భారత ప్రధాని నరేంద్రమోడీ ఫిబ్రవరి 7న మరోసారి అసోం పర్యటనకు వెళ్లనున్నారు. గత వారమే అసోంలో పర్యటించిన ఆయన 15 రోజుల వ్యవధిలోనే మరోసారి పర్యటించనుండటం గమనార్హం. ఈ ఎండాకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలోనే ప్రధాని మోడీ మళ్లీ మళ్లీ అసోంకు వె‌ళ్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పర్యటనలో భాగంగా ప్రధాని అసోంలో రెండు మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా అసోం రాష్ట్ర రహదారుల అభివృద్ధి పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈవిషయాన్ని అసోం ఆర్థిక శాఖ మంత్రి హిమాంత బిశ్వ శర్మ మీడియాకు వెల్లడించారు.