మృత్యుంజయుడు విశ్వాశ్ కుమార్ రమేశ్ ను పరామర్శించిన మోదీ
అహ్మదాబాద్ లో ప్రధాని మోదీ పర్యటన
వరంగల్ టైమ్స్, అహ్మదాబాద్ : అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. నిన్న జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడిగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో పర్యటించి, ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం ఈ దుర్ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు విశ్వాశ్ కుమార్ రమేశ్‌ను ఆసుపత్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.