సెంట్రల్ జైలుకు బిట్టు శ్రీను

హైదరాబాద్ : మంథనికి చెందిన న్యాయవాద దంపతులు వామన్‎రావు-నాగమణి హత్య కేసులో నిందితుడైన బిట్టు శ్రీనును పోలీసులు మంగళవారం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. హత్య కేసులో 7 రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉన్న బిల్లు శ్రీనుకు గడువు ముగియడంతో పోలీసులు మంథని కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు బిట్టు శ్రీనుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ వి‎ధించింది. దీంతో పోలీసులు బిట్టు శ్రీనును వరంగల్ జైలుకు తరలించారు. న్యాయవాద దంపతులను హత్య చేసిన కేసులో బిట్టు శ్రీను ఏ4 నిందితుడిగా ఉన్నాడు. నిందితులకు మారణాయుధాలు, వాహనం సమకూర్చడంతో పాటు కుంట శ్రీనుతో కలిసి హత్యకు ప్రణాళిక వేసినట్లు ఆరోపణలున్నాయి.

ads