ముమ్మరంగా తనిఖీలు

మహబూబాద్ జిల్లా : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కల్వర్టుల వద్ద బాంబ్​ స్క్వాడ్​తో పరిశీలిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత హరి భూషణ్ సొంత గ్రామమైన గంగారం మండలం మడగూడెంలో పోలీసులు అనుమానితులను విచారిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా బలగాలను మొహరించారు. గంగారం ఎస్సై చంద్రమోహన్​ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.

ads