మమత ఘటనపై పోలీసుల రిపోర్ట్ !


కోల్‎కతా : పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ గాయపడిన ఘటనపై స్థానిక పోలీసులు ప్రాథమిక విచారణ పూర్తి చేశారు. ఇది దాడి కాదని, ప్రమాదమే అయి ఉంటే అవకాశాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఎన్నికల సంఘానికి ఈ మేరకు ప్రాథమిక విచారణకు సంబంధించిన రిపోర్ట్ అందించారు. విచారణ బృందం ఘటన జరిగిన ప్రాంతంలో సాక్ష్యాధారాలు సేకరించడంతో పాటు ప్రత్యక్ష సాక్షులను విచారించే పనిలో ఉంది. అయితే సీఎం భద్రత వ్యవహారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మమతను కలవడానికి వచ్చిన ప్రజలను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయి.

ads