అషురెడ్డితో తన రిలేషన్ గురించి చెప్పిన రాహుల్

హైదరాబాద్ : బిగ్ బాస్ రియాల్టీ షో, ఇందులో పాల్గొన్న వారు ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇందులో లవ్ ట్రాక్ నడిపిన జంటలకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గురించి చెప్పన్నక్కర్లేదు. బిగ్ బాస్ రియాల్టీ షోలో సీజన్ సీజన్ కు జంటలు మారవచ్చునేమో కానీ, టాపిక్ మాత్రం మారదు. ఇక ఇప్పటివరకు జరిగిన సీజన్స్ లో రాహుల్ సిప్లిగంజ్ లవ్ ట్రాక్ కూడా ఒకటి. షోలో ఉన్నంతసేపు, పునర్నవితో రాహుల్ క్లోజ్ గా ఉండేవాడు. దీంతో షో తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోబోతోన్నారని పుకార్లు షికార్లు చేశాయి. కానీ అనూహ్యంగా తెరపైకి అషు రెడ్డి వచ్చింది. రాహుల్, అషు సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారేమో అనుకున్నారు..

ads

అయితే ఇటీవల రాహుల్ అషురెడ్డిని ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారనుకున్నారు. తాజాగా రాహుల్ ఈ విషయాలపై ఓపెన్ అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో అషుతో ఉన్న రిలేషన్ గురించి చెప్పుకొచ్చాడు రాహుల్. తనకు అషు చాలా స్పెషల్ అని, తనపై అషు చూపించే కేరింగ్ చాలా ఇష్టమని చెప్పాడు. కానీ తమ మధ్య డేటింగ్ లాంటిది ఏమీ లేదని , తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అషుతో రిలేషన్ గురించి రాహుల్ క్లారిటీ ఇచ్చాడు.

అయితే రాహుల్ చేసిన ఈ కామెంట్స్ చూసి అషురెడ్డి రాయాక్ట్ అయ్యింది. తన ఇన్స్ స్టాగ్రామ్ స్టోరీలో ఈ వీడియోని మెన్షన్ చేస్తూ ‘ థాంక్యూ రాహుల్..నాకు ఏడుపొచ్చేస్తోంది..నువ్వు ఎప్పటికీ స్పెషల్ ‘ అంటూ లవ్ సింబల్ ట్యాగ్ చేసింది.