లెనోవో నుంచి ప్రీమియం ట్యాబ్లెట్

న్యూఢిల్లీ : చైనీస్ టెక్ దిగ్గజం లెనోవో ప్రీమియం సెగ్మెంట్‎లో కొత్త ట్యాబ్లెట్‎ను భారత్‎లో ఆవిష్కరించింది. డాల్ఫీ విజన్ OLED స్క్రీన్‎తో లెనోవో పీ11 ప్రొ ప్రీమియం ట్యాబ్‎ను మార్కెట్లోకి విడుదల చేసింది. అవసరానికి అనుగుణంగా ట్యాబ్ నుంచి కీబోర్డును కూడా వేరుచేయొచ్చు. ఈ ట్యాబ్లెట్‎ను గత ఏడాది సెప్టెంబర్‎లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయగా భారత్‎లో యాపిల్ ఐప్యాడ్, శాంసంగ్ గెలాక్సీ టాబ్ ఎస్ 7 లకు గట్టి పోటీ ఇవ్వనుంది. భారత్‎లో లెనోవో ట్యాబ్ పీ 11 ప్రొ ధర రూ. 44,999 గా ఉంది. ఫిబ్రవరి 14న అర్థరాత్రి నుంచి లెనోవా డాట్‎కామ్, అమెజాన్, ఫ్లిప్‎కార్ట్ వెబ్‎సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు.

పీ 11 ప్రొ స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి. 11.50 అంగుళాలు డిస్ ప్లే , క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 730 జీ ప్రాసెసర్ , 8మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, ఆండ్రాయిడ్ 10ఓఎస్ , 8600mAh బ్యాటరీ.