కౌంటింగ్​కు సర్వం సిద్ధం

ads

నల్లగొండ జిల్లా : ఖమ్మం, వరంగల్​, నల్లగొండ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్​కు బుధవారం అధికారులు సర్వం సిద్దం చేశారు. నల్లగొండ పట్టణంలోని వేర్ హౌసింగ్ గోడౌన్స్ లో కౌటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 8 హాల్స్ లో ఒక్కో హాల్ కి 7 టేబుళ్ల చొప్పున మెత్తం 56 టేబుళ్లు ఏర్పాటుచేశారు. ఒక్కో టేబుల్ కు కౌటింగ్ సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్ తో పాటు మరో ముగ్గురు సిబ్బందిని నియమించారు. ఒక్కో హాల్ కి అసిస్టెంట్​ రిటర్నింగ్ అధికారులను బాధ్యులుగా నియమించారు.

మార్చి 14 న జరిగిన పోలింగ్ లో ఈ నియోజకవర్గంలో 76.41 శాతం పోలింగ్ నమోదు అయింది. 5 , 05, 565 ఓట్లకు గాను 3,86, 320 ఓట్లు పోలయ్యాయి. మంగళవారం అధికారులు మాక్ కౌటింగ్ ను విజయవంతంగా పూర్తి చేశారు. 24 గంటలు నిరంతరాయంగా కౌటింగ్ నిర్వహించేందుకు 4 వేల సిబ్బందిని షిఫ్ట్ ల వారిగా నియమించారు. బుధవారం ఉదయం 7 గంటలకు అభ్యర్దులు, కౌటింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూంను ఓపెన్ చేస్తారు. వారి సమక్షంలో 731 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్స్ లను కౌటింగ్ హాల్స్ కు తరలిస్తారు. వారి అనుమతి తీసుకుని బ్యాలెట్ బాక్స్ లను ఒపెన్ చేసి పోలైన అన్ని బ్యాలెట్ పేపర్లను కలబోస్తారు. 25 బ్యాలెట్ పేపర్లను ఒక బండీల్ గా కడతారు. ఆతర్వాత ఒక్కో టేబుల్ కు వెయ్యి ఓట్ల చొప్పున వాటిని పంపిణీ చేస్తారు. వాటిలో చెల్లిన ఓట్లను, మురిగిన ఓట్లను వేరు చేస్తారు. మెత్తం చెల్లుబాటైన ఓట్లను ఫైనలైజ్ చేసి గెలుపునకు కావాల్సిన కోటా ను నిర్ణయిస్తారు. ఆ తర్వాత మెదటి ప్రియార్టీ ఓట్లను లెక్కించే ప్రక్రియను మొదలు పెడుతారు. 56 టేబుళ్లలో ఒక్కో రౌండ్ లో 56 వేల ఓట్లను లెక్కించనున్నారు.

బుధవారం రాత్రి 11 గంటల సమయంలో మెదటి విడత ఫలితం రానుందని అధికారులు అంచనా వేశారు. మెదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గెలుపునకు నిర్ణయించిన కోటాను ఏ అభ్యర్థి చేరుకోక పోతే ఎలిమేషన్ పద్ధతిలో అతి తక్కవ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎలిమినేషన్ చేస్తారు. అతడికి పడ్డ ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఏ అభ్యర్దికి పడ్డాయో లెక్కించి వాటిని ఆ సంబంధిత అభ్యర్థికి బదలాయింపు చేస్తారు. ఇలా తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థుల్ని ఒక్కొక్కరిని ఎలిమినేషన్ చేస్తూ కోటాకు రావాల్సిన ఓట్లు వచ్చేంత వరకు కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు. ఇలా కోటాను ముందుగా ఏ అభ్యర్థి క్రాస్ చేస్తారో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ కౌటింగ్ ప్రదేశంలో 90 సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు. సీఆర్ పీఎఫ్ బలగాల్ని మొహరించారు.
కౌటింగ్ పూర్తయ్యేంతవరకు నల్గొండ పట్టణంలో 144 సెక్షన్ విధింపు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.