విశాఖలో రాష్ట్రపతి పర్యటన ఎప్పుడంటే !

విశాఖలో రాష్ట్రపతి పర్యటన ఎప్పుడంటే !

వరంగల్ టైమ్స్, విశాఖపట్నం : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జూన్ 10న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో పర్యటించనున్నారు. కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో ఆమె పాల్గొననున్నారు.. ఆ రోజున ఉదయం 11.30 గంటలకు విశాఖ చేరుకోనున్న ఆమె ఆ తర్వాత కారులో బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్తారు. అక్కడ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు తిరిగి ఝార్ఖండ్ పర్యటనకు బయల్దేరుతారు.