విజయవంతంగా రాష్ట్రపతికి బైపాస్ సర్జరీ


ఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు విజయవంతంగా బైపాస్ సర్జరీ జరిగింది. ఛాతి నొప్పితో కొద్దిరోజుల క్రితం ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రిలో చేరిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వైద్యుల సూచన మేరకు ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. బైపాస్ సర్జరీ తప్పనిసరి అని వైద్యుల సూచన మేరకు నేడు సర్జరీ చేయించుకున్నారు. మొత్తానికి విజయవంతంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు బైపాస్ సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ త్వరితగతిన కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ads