బెంగళూరుపై పంజాబ్ ఘన విజయం

అహ్మదాబాద్ : ఐపీఎల్ 14వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు అదిరే విజయం దక్కింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఆల్ రైండ్ షోతో అదరగొట్టిన పంజాబ్ 34 పరుగుల తేడాతో గెలుపొందింది. 180 పరుగుల ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగలే చేసింది. ఛేదనలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ( 35 : 34 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ ), రజత్ పటిదార్ ( 31: 30 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ ) , హర్షల్ పటేల్ ( 31 : 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్ మెన్ దేవదత్ పడిక్కల్ (7), గ్లెన్ మ్యాక్స్ వెల్ (0), ఏబీ డివిలియర్స్ ( 3), షాబాజ్ అహ్మద్ (8), డేనియల్ సామ్స్ (3) ఘోరంగా ఓటమిపాలయ్యారు. పంజాబ్ బౌలర్లలో హర్ ప్రీత్ 3, రవిబిష్ణోయ్ 2 వికెట్లు తీయగా మెరిడిత్, మహ్మద్ షమీ, జోర్డాన్ తలో వికెట్ పడగొట్టారు.

ads

రాహుల్ 991 నాటౌట్ : 57 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్ హాఫ్ సెంచరీతో రాణించడంతో పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ (46 : 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ) క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివరగా హర్ ప్రీత్ బ్రార్ ( 25 నాటౌట్ : 17 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు ) ఆకట్టుకున్నాడు. బెంగళూరు బౌలర్లలో జెమీసన్ 2 వికెట్లు తీయగా డేనియల్ సామ్స్ , యుజువేంద్ర చాహల్ , షాబాజ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.