పీవీ సింధు ఔట్​

బ్యాంకాక్​ : టయోటా థాయ్​లాండ్​ ఓపెన్​ సూపర్​‌‌-1000 టోర్నీలో ఇండియా స్టార్​ షట్లర్​, వరల్డ్​ ఛాంపియన్​ పీవీ సింధుకు షాక్​ తగిలింది. క్వార్టర్​ ఫైనల్లో పేలవ ప్రదర్శనతో సింధు ఘోరంగా నిరాశపరిచింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్​ క్వార్టర్​ ఫైనల్స్​ మ్యాచ్​లో ఆరోసీడ్ సింధు 13-21-,9-21తో థాయ్​లాండ్ షట్లర్​ రచనోక్​ ఇంటానన్​ చేతిలో ఓటమిపాలైంది. వరుసగా రెండు ఆటల్లో సంపూర్ణ మెజార్టీ కనబర్చిన రచనోక్​ సింధును మట్టికరిపించింది.

పురుషుల సింగిల్స్​లో యువ ఆటగాడు సమీర్​ వర్మ పోరాడి ఓటమి చవిచూశారు. క్వార్టర్​ ఫైనల్లో సమీర్​ 13-21,21-19,20-22 తో ప్రపంచ నంబర్​ 3 ఆండర్స్​ ఆంటోన్సెన్​ ( డెన్మార్క్​) చేతిలో ఓటమి పాలయ్యాడు. అలాగే మిక్స్​డ్​ డబుల్స్​లో సాత్విక్​సాయిరాజ్​ రాంకీరెడ్డి , అశ్విని పొనప్ప ద్వయం18-21, 24-22, 22-20తో మలేషియా జోడీ పెంగ్​సూన్​, లుయింగ్​పై విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్​లో సాత్విక్​, చిరాగ్​ శెట్టి ద్వయం 21-18,24-22తో మలేషియా జోడీపై గెలిచింది.