పీవీ సింధుకు షాక్​

బ్యాంకాక్​ : టయోటా థాయ్​లాండ్​ ఓపెన్​ సూపర్​‌‌-1000 టోర్నీలో ఇండియా స్టార్​ షట్లర్​, వరల్డ్​ ఛాంపియన్​ పీవీ సింధుకు షాక్​ తగిలింది. క్వార్టర్​ ఫైనల్లో పేలవ ప్రదర్శనతో సింధు ఘోరంగా నిరాశపరిచింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్​ క్వార్టర్​ ఫైనల్స్​ మ్యాచ్​లో ఆరోసీడ్ సింధు 13-21-,9-21తో థాయ్​లాండ్ షట్లర్​ రచనోక్​ ఇంటానన్​ చేతిలో ఓటమిపాలైంది. వరుసగా రెండు ఆటల్లో సంపూర్ణ మెజార్టీ కనబర్చిన రచనోక్​ సింధును మట్టికరిపించింది. పురుషుల సింగిల్స్​లో యువ ఆటగాడు సమీర్​ వర్మ పోరాడి ఓటమి చవిచూశారు. క్వార్టర్​ ఫైనల్లో సమీర్​ 13-21,21-19,20-22 తో ప్రపంచ నంబర్​ 3 ఆండర్స్​ ఆంటోన్సెన్​ ( డెన్మార్క్​) చేతిలో ఓటమి పాలయ్యాడు.