కొవిడ్ టెస్ట్ రిపోర్ట్‎లో క్యూఆర్ కోడ్

హైదరాబాద్: మ్యాప్మైజీనోమ్ దుబాయ్ నిబంధనల ప్రకారం కొవిడ్ టెస్ట్ రిపోర్టులలో క్యూఆర్ (QR) కోడ్‎ను జోడించింది. వారి కొవిడ్ పరీక్ష రిపోర్టులలో సురక్షితమైన సర్వర్లో నిల్వ చేయబడిన అసలు పరీక్ష రిపోర్టును తెరవగల QR కోడ్ ఉందని భారతీయ జీనోమిక్స్ సంస్థ మ్యాప్మైజీనోమ్ (Mapmygenome) ప్రకటించింది. మ్యాప్మైజీనోమ్ ల్యాబ్స్‎లో పరీక్షించిన వ్యక్తుల యొక్క అన్ని రిపోర్టులలో QR కోడ్‎తో పాటు శాంపిల్ సేకరణ మరియు రిపోర్టింగ్ యొక్క తేదీ మరియు సమయంపై సమాచారం ఉంటుంది. ఈ మార్పు దుబాయ్ హెల్త్ అథారిటీ చేసిన కొత్త నిబంధనలను అనుసరించి వచ్చింది.

మ్యాప్మైజీనోమ్ సంస్థకు రెండు కొవిడ్ పరీక్ష ల్యాబ్స్ ఉన్నాయి. మాదాపూర్ మరియు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలలో సేకరించిన అన్ని శాంపిళ్లు వారి ల్యాబ్ సాఫ్ట్వేర్ బయోట్రాకర్‎కు చేరుతాయి. వారి అన్ని పరీక్షల యొక్క మొత్తం ప్రక్రియ బయోట్రాకర్‎లోకి మ్యాప్ చేయబడింది. ఈ సాఫ్ట్వేర్లో బార్కోడ్ మరియు QR కోడ్ తయారు చేసే సౌకర్యం కూడా ఉంది. మ్యాప్మైజీనోమ్ యొక్క సాఫ్ట్వేర్ బృందం కొవిడ్ రిపోర్టులకు QR కోడ్‎ను చేర్చింది. ముద్రిత రిపోర్టుపై QR కోడ్‎ను స్కాన్ చేసినప్పుడు, అధికారులు అసలు రిపోర్టును చూడవచ్చు.

“దుబాయ్ హెల్త్ అథారిటీ యొక్క కొత్త QR కోడ్ నిబంధనలు కొవిడ్ పరీక్ష ఫలితాల రిపోర్టింగ్‎లో నిజాయితీని నిర్ధారించడానికి మార్గమని మ్యాప్మైజీనోమ్ సీఈవో అనూ ఆచార్య వివరించారు. మేము వాటిని అనుసరించడానికి సంతోషిస్తున్నాము. విమాన ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్నందున, కొవిడ్ వ్యాప్తిని ట్రాక్ చేయడానికి మరియు నిరోధించడానికి ఇది మంచి పద్ధతి. హైదరాబాద్ మీదుగా ప్రయాణించే ప్రయాణికులందరూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ పరీక్ష తీసుకొని QR కోడెడ్ టెస్ట్ రిపోర్టులను పొందవచ్చని అనూ ఆచార్య కోరారు. మా ఆటోమేటెడ్ వర్క్ఫ్లోస్ ఈ మార్పును జీరో డౌన్ టైంతో అమలు చేయడానికి మాకు సహాయపడ్డాయి అని పేర్కొన్నారు.”