ఈ విష‌యాన్ని సీఎం దృష్టికి తీనుకెళ్తా

నిర్మ‌ల్ బొమ్మ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన `రాధాకృష్ణ` సినిమాను ప్ర‌తి ఒక్క‌రూ చూసి ప్రోత్స‌హించాలని కోరుకుంటున్నాను : మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

హైదరాబాద్​: ప్ర‌ముఖ ద‌ర్శకుడు`ఢ‌మ‌రుకం`ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో రూపొందుతున్న చిత్రం ‘రాధాకృష్ణ‌’. అనురాగ్‌, ముస్కాన్ సేథీ(పైసా వ‌సూల్ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో నంద‌మూరి లక్ష్మీ పార్వతి ఒక కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. టీడీ ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్నిహ‌రిణి ఆరాధ్య‌ క్రియేష‌న్స్ ప‌తాకంపై పుప్పాల సాగ‌రిక కృష్ణ‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాట‌లు ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ‌వుతున్నాయి. ఇప్ప‌‌టికే విడుద‌లైన సాంగ్స్‌, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఫిబ్ర‌వ‌రి5న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లా హోట‌ల్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర అట‌వీ,ప‌ర్యావ‌ర‌ణ‌,దేవాదాయ‌,న్యాయ‌శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై `రాధాకృష్ట` మూవీ బిగ్‌టికెట్‌ను ఆవిష్క‌రించారు.

‘నూత‌నంగా ఏర్ప‌డిన నిర్మ‌ల్ జిల్లాలో ప్ర‌కృతి మ‌నకిచ్చిన ప్ర‌సాదం విశాల‌మైన అడ‌వి, కుంటాల జ‌ల‌పాతం, క‌వ్వాల్ టైగ‌ర్‌జోన్. ఇలాంటి అంద‌మైన లోకేష‌న్స్‌లో `రాధాకృష్ణ` మూవీ చిత్రీక‌రించ‌డం నిజంగా అభినందించాల్సిన విష‌యం అన్నారు మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతిగాంచిన నిర్మ‌ల్ కొయ్య‌ బొమ్మ‌ల నేఫ‌థ్యంలో, అంత‌రించిపోతున్న హ‌స్త క‌ళ‌లు, క‌ళాకారుల గురించి సాగ‌రిక కృష్ణ‌కుమార్‌ మంచి క‌థ‌ను ఎంచుకుని ఈ సినిమాను నిర్మించారు. వారికి నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. నిర్మ‌ల్ బొమ్మ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ప్ర‌తి ఒక్క‌రూ చూసి ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంది అని చెప్పారు మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి.

అలాగే లక్ష్మి పార్వ‌తి ఈ చిత్రంలో ఒక ప్ర‌ధాన పాత్ర పోషించడం చాలా సంతోష‌క‌ర‌మైన విష‌యం. హీరో అనురాగ్‌, హీరోయిన్ ముస్కాన్ సేథీల‌కు ఈ సినిమా మంచి పేరు తేవాల‌ని ఆశిస్తున్నాను. అలాగే అలీ, కృష్ణ భ‌గ‌వాన్ ఈ సినిమాలో న‌టించ‌డం జ‌రిగింది వారికి నా అభినంద‌న‌లు. ఎం.ఎం.శ్రీ‌లేఖ‌ మంచి సంగీతం అందించారు వారికి, ఈ సినిమాలో నిర్మ‌ల బొమ్మా పాట పాడిన మంగ్లీకి అభినంద‌న‌లు. అలాగే శ్రీ‌నివాస రెడ్డి చాలా ఎక్స్‌పీరియ‌న్స్ డైరెక్ట‌ర్ వారు ఈ సినిమాని ముందుండి న‌డిపారు. పూర్తిగా తెలంగాణలోని నిర్మ‌ల్‌ జిల్లాలోనే చిత్రీక‌రించిన సినిమా . అందులోనూ నిర్మ‌ల్ క‌ళాకారుల క‌ష్టాల నేప‌థ్యంలో మంచి ఆశ‌యంతో తీసిన కాబ‌ట్టి త‌ప్ప‌కుండా ఈ విష‌యాన్ని సీఎం దృష్టికి తీనుకెళ్తాను. ఈ మూవీ పెద్ద స‌క్సెస్ కావాల‌ని ఆ భ‌గ‌వంతున్ని ప్రార్ధిస్తున్నాను“ అన్నారు మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి.

‘400 ఏళ్ల చ‌రిత్ర ఉన్న నిర్మ‌ల్‌బొమ్మ‌ల గురించి తీసిన ఈ సినిమా త‌ప్ప‌కుండా మంచి స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. నిర్మాత సాగ‌రిక కృష్ణ‌కుమార్ అలాగే టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌’ అన్నారు ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ వ‌రంగ‌ల్ శ్రీ‌ను.

అనురాగ్‌, ముస్కాన్ సేథీ(పైసా వ‌సూల్ ఫేమ్‌), ల‌క్ష్మీ పార్వ‌తి, అలీ, కృష్ణ భ‌గ‌వాన్‌, అన్న‌పూర్ణ‌మ్మ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: సురేంద‌ర్ రెడ్డి, సంగీతం : ఎం.ఎం. శ్రీలేఖ‌, ఎడిటింగ్‌ : డీ వెంక‌ట‌ప్ర‌భు, ఆర్ట్ : వీ ఎన్ సాయిమ‌ణి, నిర్మాణ సార‌థ్యం: కృష్ణ కుమార్‌, నిర్మాత‌ : పుప్పాల సాగ‌రిక‌ కృష్ణకుమార్, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌ : శ్రీనివాస రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం : టీడీ ప్ర‌సాద్ వ‌ర్మ‌.