ప్లాట్‌ఫాం టికెట్ ధర పెంపు

హైదరాబాద్​ : రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి ఏకంగా రూ.50కి పెంచుతూ సెంట్రల్ రైల్వే నిర్ణయం తీసుకుంది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ ధరలను తక్షణమే అందుబాటులోకి తీసుకొచ్చింది. పెరిగిన ప్లాట్‌ఫాం ధరలు మార్చి 1 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ సుతార్ తెలిపారు. జూన్ 15 వరకు ఈ ధరలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు నగరాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు సుతార్​ తెలిపారు. ఆయా రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

ads