`పవర్ ప్లే` రిలీజ్​ డేట్​ ఫిక్స్​

మార్చి 5న రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల `పవర్ ప్లే`హైదరాబాద్​: యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న లేటెస్ట్ మూవీ `పవర్ ప్లే`. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌ మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మార్చి 5న గ్రాండ్‌గా విడుద‌ల‌చేయ‌నున్నారు. ఈ రోజు వాలైంటైన్స్ డే సంద‌ర్భంగా స్పెషల్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ రొమాంటిక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

‘నేను విజ‌య్‌ క‌లిసి స‌రికొత్త జోన‌ర్‌లో చేస్తోన్న డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్ ఇది. క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి హిట్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది’అన్నారు యంగ్ హీరో రాజ్ త‌రుణ్

‘ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. డెఫినెట్‌గా అంద‌ర్నీ థ్రిల్ చేస్తుంది’అన్నారు చిత్ర దర్శకుడు విజయ్​కుమార్​ కొండా.

‘ ఈ వాలైంటైన్స్ డే సంద‌ర్భంగా ప‌వ‌ర్‌ప్లే టీమ్ త‌రుపున ఒక కాంటెస్ట్ నిర్వ‌హిస్తున్నాం. మీరు మీ వాలైంటైన్‌తో క‌లిసి ల‌వ్ ప్ర‌పోజ్ చేస్తూ ఒక షార్ట్ వీడియో తీసి దానికి @𝘃𝗮𝗻𝗮𝗺𝗮𝗹𝗲𝗲_𝗰𝗿𝗲𝗮𝘁𝗶𝗼𝗻𝘀 ని టాగ్ చేసి మీ సోష‌ల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేయండి. ఈ నెల 16వ తారీకు వ‌ర‌కూ మీరు వీడియోస్ పంపొచ్చు. ఫిబ్ర‌వ‌రి 18న ఈ కాంటెస్ట్‌లో గెలిచిన జంటలు దుబాయ్ ట్రిప్ సొంతం చేసుకుంటారు’అన్నారు చిత్ర నిర్మాత దేవేష్​.

‘మార్చి 5న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం’అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ పా‌ల‌ప‌ర్తి అనంత్ సాయి

రాజ్ త‌రుణ్‌, హేమ‌ల్ ఇంగ్లే, పూర్ణ‌, మ‌ధు నంద‌న్‌, అజ‌య్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌, కేద‌రి శంక‌ర్‌, టిల్లు వేణు, భూపాల్‌, అప్పాజీ, ర‌వివ‌ర్మ‌, సంధ్య‌ జ‌న‌క్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
క‌థ‌-మాట‌లు : న‌ంద్యాల ర‌వి
సినిమాటోగ్ర‌ఫీ : ఐ ఆండ్రూ
సంగీతం : సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్ : ప‌్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌ : శివ‌
ఫైట్స్‌ : `రియ‌ల్` స‌తీష్‌
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌ : బీవీ సుబ్బారావు
కో- డైరెక్ట‌ర్ : వేణు కురపాటి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌ : పా‌ల‌ప‌ర్తి అనంత్ సాయి
స‌మ‌ర్ప‌ణ‌ : శ్రీ‌మ‌తి ప‌ద్మ‌
నిర్మాత‌లు : మ‌హిద‌ర్‌, దేవేష్‌
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం : విజ‌య్ కుమార్ కొండా