ట్రిపుల్ ఆర్ టీంకు రాజమౌళి సర్ ప్రైజ్ గిఫ్టులు

హైదరాబాద్ : ఫిల్మ్ స్టార్స్ బర్త్ డేకి ఆయా సినిమా టీమ్ లు స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వడం కామన్. కానీ దర్శక ధీరుడు రౌజమౌళి బర్త్ డే గిప్ట్ మాత్రం కాస్తంత స్పెషల్ అని చెప్పక తప్పదు.. ఆయన ట్రిపుల్ ఆర్ టీమ్ కు ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ లు మాత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాయి. అవేంటో ఓ లుక్కేద్దాం ..

ads

దర్శక ధీరుడు రాజమౌళి క్రియేటివిటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన మొదటి సినిమా నుంచి బాహుబలి 2 వరకు ఓటమి ఎరుగని డైరెక్టర్. ఆయన సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తారో… ఆయన బర్త్ డేలకు ఇచ్చే సర్ ప్రైజ్ ల గురించి ఆయన సినిమాలో నటించే స్టార్స్ కూడా అంతే ఎదురు చూస్తారు. తాజాగా రాజమౌళి, రామ్‌చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ట్రిపుల్ ఆర్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కీలకపాత్ర షోషిస్తున్న అజయ్ దేవగన్ బర్త్ డే సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు దర్శక ధీరుడు.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా తారక్‌ నటిస్తున్నారు. గతంలో వీరి బర్త్ డే కానుకగా ఇంట్రో వీడియోలు రిలీజ్ చేసి సర్ ప్రైజ్ లు చేశాడు. ట్రిపుల్ ఆర్ మూవీ స్టార్ అయిన తర్వాత రామ్ చరణ్ మొదటి బర్త్ డే కి ఇంట్రో వీడియో రిలీజ్ చేసి సర్ ప్రైజ్ చేయగా, లేటేస్ట్ గా మాత్రం సెట్ లోనే విషెష్ చెబుతూ చరణ్ కు మరచిపోలేని సర్ ప్రైజ్ ఇచ్చాడు.

కొమురం భీమ్ గా నటిస్తున్న తారక్ కూడా ఇంట్రో వీడియోతో సర్ ప్రైజ్ చేశాడు. ఇద్దరు స్టార్స్ నటిస్తున్న వారి ఇమేజ్ కు ఏ మాత్రం తీసిపోకుండా పాత్రలు రూపొందిస్తున్న విధానం ఇంట్రో వీడియోలో ఇట్టే అర్థమవుతుంది. ఫస్ట్ బర్త్ డే కి ఇంట్రో వీడియో రిలీజ్ చేసిన రాజమౌళి సెకెండ్ బర్త్ డే కి ఏం సర్ ప్రైజ్ ఇస్తాడో చూడాలి. వీరికి జోడిగా ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రియ, సముద్రఖని, హాలీవుడ్‌ తారలు ఎలిసన్‌ డ్యూడీ, రేయ్‌ స్టీవెన్‌సన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.