రాజన్న శివరాత్రి ఆదాయం రూ.63లక్షలు

రాజన్న సిరిసిల్ల జిల్లా : మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ రాజన్న ఆదాయం ఒక్కరోజే రూ.63,32,345 వచ్చింది. కోడెమొక్కు ద్వారా రూ.20 లక్షల 46 వేలు, లడ్డూ ప్రసాదాల ద్వారా రూ.29 లక్షలు, పులిహోర అమ్మకాల ద్వారా రూ.98 వేలు, శీఘ్ర దర్శనం టికెట్ల ద్వారా రూ.3.97 లక్షలు, వీఐపీల దర్శనాల టిక్కెట్ల ద్వారా రూ.4లక్షల 55 వేలు, భీమేశ్వరాలయంలో ప్రసాదాల అమ్మకాల ద్వారా రూ. 2లక్షలు సమకూర్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఆదాయం 10 తేదీ బుధవారం రాత్రి 12 గంటల నుంచి గురువారం రాత్రి 12 గంటల వరకు మాత్రమేనని అని తెలిపారు.

ads