రమణారెడ్డి మృతి తీరని లోటు

హైదరాబాద్: టీఆర్ఎస్​ సౌత్ ఆఫ్రికా కోర్ కమిటీ సభ్యులు ఎన్​ఆర్ ఐ కంకణాల రమణా రెడ్డి మృతి తీరని లోటు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఈ నెల 1 న ఆస్ట్రేలియా లోని జోహెన్నాస్ బర్గ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రమణా రెడ్డి మృతి చెందిన విషయం విధితమే. కాగా ఆదివారం ఉదయం రమణారెడ్డి పార్థివ దేహం హైదరాబాద్ లోని ఆయన ఇంటికి చేరింది. విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి రమణారెడ్డి పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.

‘ఎన్ఆర్ ఐగా ఆస్ట్రేలియాలో ఉంటూనే తెలంగాణ ఉద్యమం లో భాగస్వామ్యమైన రమణారెడ్డి ఎప్పుడూ చిరస్మరణీయుడే నన్నారు. ఇటువంటి సమయంలో కుటుంబ సభ్యులకు మానసిక ధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను’అని మంత్రి జగదీశ్​రెడ్డి చెప్పారు