షకీబల్ హసన్ రికార్డు

ఢాకా : బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబల్ హసన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. సోమవారం వెస్టిండీస్ తో జరిగిన వన్డే మ్యాచ్‎లో షకీబ్ గతంలో ఎవరికీ సాధ్యం కానీ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‎లో ఒకే దేశంలో 6వేలకు పైగా పరుగులు, 300లకు పైగా వికెట్లు తీసిన ఏకైక ప్లేయర్ గా షకీబ్ నిలిచాడు.

అతడు బంగ్లాదేశ్ లో టెస్టులు, వన్డేలు, టీ 20లు కలిపి ఈ రికార్డు సాధించాడు. బుకీలు తనను కలిసినా ఆ విషయాన్ని చెప్పని కారణంగా ఏడాది నిషేధం ఎదుర్కొన్న షకీబ్ ఈ సిరీస్ తో మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. విండీస్ తో జరిగిన మూడో వన్డేలో 51 పరుగులు చేశాడు. గతంలో ఇండియన్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ ఇండియాలో 4 వేలకుపైగా పరుగులు, 300కు పైగా వికెట్లు తీశాడు. 2006లో బంగ్లాదేశ్ తరపున అరంగేట్రం చేసిన షకీబ్ 2019 వరల్డ్ కప్ లో ఆ టీమ్ సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు.