అతన్నేపెండ్లి చేసుకుంటానంటున్న రష్మిక

హైదరాబాద్ : ఛలో సినిమాతో తెలుగు ఆడియెన్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేసింది కన్నడ సోయగం రష్మిక మందన్నా. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ బిజీయోస్ట్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది ఈ భామ. ఈ సంవత్సరం కార్తీ నటించిన సుల్తాన్ సినిమాతో కోలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. గ్రామీణ ప్రాంత అమ్మాయిగా మంచి అభినయాన్ని ప్రదర్శించింది రష్మిక. ఎప్పుడూ సినియాలు, ఇతర అంశాల గురించి మాట్లాడే రష్మిక ఈ సారి మాత్రం పెండ్లి విషయాన్ని ప్రస్తావించింది. తాను తమిళియన్ ను పెండ్లి చేసుకుంటానని చెప్తోంది.

ads

తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాలు నన్ను బాగా ఆకర్షించాయి. ప్రత్యేకించి అక్కడి ఆహారం, తమిళనాడు ఫుడ్ తో ప్రేమలో పడిపోయా, తమిళియన్ ను పెండ్లి చేసుకుని, తమిళనాడు కోడలిని అవుతానని చెప్పుకొచ్చింది. ఒకవేళ రష్మిక నుంచి పెండ్లి వార్త వస్తే మరి ఈ భామ ఎవరిని వివాహమాడుతుందో వేచిచూడాల్సిందే.