తగ్గిన బంగారం, వెండి ధరలు

న్యూఢిల్లీ: దేశంలో విలువైన లోహాల ధరలు మళ్లీ తగ్గాయి. బంగారం ధరలు స్వల్పంగా దిగిరాగా, వెండి ధర భారీగా తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 99.9 స్వచ్ఛత కలిగిన 10గ్రాముల బంగారం ధర రూ.342 తగ్గి రూ.45,599కి చేరింది. క్రితం ట్రేడ్ లో తులం బంగారం ధర రూ.45,941 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ లలో నేడు బంగారం, వెండి కొనుగోళ్లకు పెద్దగా డిమాండ్ లేకపోవడమే దేశీయంగా వాటి ధరలు దిగి రావడానికి కారణమని హెచ్‎డీఎఫ్‎సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.

ads

బంగారంతో పాటు వెండి ధరలైతే భారీగా తగ్గాయి. కిలో వెండి ధర ఏకంగా రూ.2,007 తగ్గి రూ.67,419కి పడిపోయింది. క్రితం ట్రేడ్‎లో కిలో వెండి ధర రూ.69,426 వద్ద ముగిసింది. ఇదిలా ఉంటే నేడు అంతర్జాతీయ మార్కెట్‎లలో ఔన్స్ బంగారం ధర 1,760 అమెరికన్ డాలర్ లు , ఔన్స్ వెండి ధర 26.78 అమెరికన్ డాలర్‎లు పలికింది.