రిలీజ్ కి రెడీగా క‌దిలే కాలాన్ని అడిగా


హైదరాబాద్: అల్లు అరవింద్,‌ జీఏ2 పిక్చ‌ర్స్, బ‌న్నీవాసు కార్తికేయ “చావు క‌బురు చ‌ల్ల‌గా ” చిత్రం నుంచి సెకండ్ సింగిల్ సాంగ్‌ క‌దిలే కాలాన్ని అడిగా ఫిబ్ర‌వ‌రి 23న సాయంత్రం 4:05 ని.లకు విడుద‌లకానుంది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచాడు నిర్మాత బన్నీ వాసు. ‌బన్నీ వాసు నిర్మాతగా, ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ‌ఇప్పటికే విడుదలైన టైటిల్, హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్, ఇంట్రోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి, మైనేమ్ ఈజ్ రాజు అనే పాట‌కు కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో చావు క‌బ‌రు చ‌ల్ల‌గా ఆడియో నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ ని విడుద‌ల చేయ‌డానికి ముహుర్తం ఖరారైంది. ఫిబ్ర‌వ‌రి 23న సాయంత్రం 4 గంట‌ల 5 నిమ‌షాల‌కి క‌దిలే కాలాన్ని అడిగా అంటూ సాగే ఓ బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్ ని విడుద‌ల చేస్తున్న‌ట్లుగా హీరో కార్తికేయ‌, హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి ఉన్న ఓ ల‌వ్లీ పోస్టర్ తో ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రం నుంచి విడుద‌ల చేసిన ప‌బ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య స్పంద‌న అంద‌చేశారని చిత్ర ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి అన్నారు. సినీ అభిమానుల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే రాబోతున్న‌ క‌దిలే కాలాన్ని అడిగా పాట‌ను సిద్ధం చేసినట్లుగా కౌశిక్ తెలిపారు. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.

నటీనటులు :
కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని,ముర‌ళి శ‌ర్మ‌, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్ర‌భు త‌దితరులు

సాంకేతిక వ‌ర్గం :
స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌వింద్
బ్యాన‌ర్ : జీఏ2 పిక్చ‌ర్స్
నిర్మాత : బ‌న్నీ వాసు
దర్శకుడు : కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి
ఎడిట‌ర్‌ : స‌త్య జి
ఆర్ట్‌ : జి ఎమ్ శేఖ‌ర్‌
మ్యూజిక్ : జేక్స్‌ బిజాయ్
సినిమాటోగ్రాఫ‌ర్ : క‌ర‌మ్ ఛావ్లా
అడిషిన‌ల్ డైలాగ్స్ : శివ కుమార్ భూజుల‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్స్ : రాఘ‌వ క‌రుటూరి, శ‌ర‌త్ చంద్ర నాయిడు
లిరిక‌ల్ వీడియోస్ : క్రేజీ షౌట్
ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ : మ‌నిషా ఏ ద‌త్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్ : మౌనా గుమ్మ‌డి