చారిత్రక సంపదను గుర్తించాలి : మంత్రి ఎర్రబెల్లి

ఢిల్లీ : వరంగల్ ఉమ్మడి జిల్లాలో జాతర ఉత్సవాలు టూరిజం ప్రాధాన్యత స్థలాలు ఉన్నాయని, ఈ స్థలాల అభివృద్ధి కి కేంద్ర ప్రభుత్వ సహాయ, సహకారాలు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కేంద్ర పర్యాటక సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పాటిల్ ను కోరారు. ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న రామప్ప దేవాలయాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తింపు ప్రక్రియకు సహకరించాలని నిన్న రాత్రి ఢిల్లీలో కేంద్ర పర్యాటక సహాయ మంత్రిని తెలంగాణ రాష్ట్ర మంత్రులు కోరారు.

ads

చారిత్రక సంపదకు నెలవైన రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. దీనికి తోడుగా ఆసియాలో అతి పెద్ద మేడారం గిరిజన జాతరను జాతీయ పండుగగా ప్రకటించి జాతర అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. జనగామ జిల్లాలోని జాఫర్ గడ్ కోట, బమ్మెర పోతన మ్యూజియం, పాలకుర్తి సోమేశ్వర దేవాలయం, వల్మీడి, ఖిలా షాపూర్ కోటల అభివృద్ధికి నిధులను ప్రత్యేకంగా మంజూరు చేయాలని కోరారు.