రికార్డు సాధించిన స్పిన్నర్

హైదరాబాద్ : ఆఫ్గనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. 21వ శతాబ్దంలో ఒకే టెస్టులో అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్‎గా రషీద్ ఖాన్ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో రెండో టెస్టులో రషీద్ 99.2 ఓవర్లు వేసి చరిత్ర సృష్టించాడు. కేప్ టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ 98 ఓవర్లు వేసి రికార్డును తాజాగా రషీద్ బ్రేక్ చేశాడు. 1998లో ఓవర్‎లో ఇంగ్లాండ్‎పై శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 113.5 ఓవర్లు బౌలింగ్ చేశాడు. జింబాబ్వేతో రెండో టెస్టులో ఆఫ్గనిస్థాన్ 6 వికెట్లతో విజయం సాధించింది.

ads