బాల కార్మికులకు విముక్తి

హైదరాబాద్ : ఇంటి నుంచి తప్పిపోయి అయిన వారికి దూరమైన అనాథలు, వివిధ ప్రాంతాల్లో, పరిశ్రమల్లో వెట్టిచాకిరీలో మగ్గుతున్న బాలకార్మికుల జీవితాల్లో తిరిగి సంతోషాన్ని తెచ్చేందుకు తెలంగాణ పోలీసులు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వరుసగా ఏడోసారి ఈనెల జనవరి ఒకటి నుంచి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. మహిళా, శిశుసంక్షేమశాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రదేశాలు,హోటళ్లు,పరిశ్రమలు, ఇటుక బట్టీలు ఇలా చిన్నారుల జాడకనిపెట్టేందుకు పోలీసులు కృషిచేశారు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 223 మంది బాల కార్మికులను గుర్తించారు. ఇటుక బట్టీలు, గాజుల పరిశ్రమ, ఇళ్ల నిర్మాణం, భిక్షాటన , దుకాణాలు తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న 10 రాష్ట్రాలకు చెందిన బాలల కార్మికులను గుర్తించి విముక్తి కల్పించారు.