రెడ్‎మి నోట్ 10 సిరీస్ లాంఛ్!

న్యూఢిల్లీ: ఇండియాలో రెడ్‎మీ నోట్ 10 సిరీస్‎ను లాంఛ్ చేయనున్నట్లు షియోమి ప్రతినిధులు సంకేతాలు పంపారు. రెడ్‎మీ నోట్ 9 సిరీస్‎కు కొనసాగింపుగా తాజా స్మార్ట్‎ఫోన్ సిరీస్ రానుంది. దీనికి సంబంధించి బుధవారం ఉదయం ప్రకటన ఉంటుందని షియోమి ప్రతినిధులు వెల్లడించిన టీజర్‎లో పేర్కొన్నారు.

రెగ్యులర్ రెడ్‎మీ నోట్ 10తో పాటు రెడ్‎మి నోట్ 10 ప్రొను తాజా సిరీస్‎లో లాంఛ్ చేయవచ్చని భావిస్తున్నారు. రెడ్‎మి నోట్ 10 ప్రొ క్వాల్‎కామ్ స్నాప్‎డ్రాగన్ 732 ఎస్ఓసీ ఆధారంగా పనిచేయడంతో పాటు 5050 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుందని అంచనా. ఇక ఈ స్మార్ట్‎ఫోన్ 8జీబీ ర్యామ్‎తో అందుబాటులో ఉండనుంది.

భారత్‎లో రెడ్‎మి నోట్ 10 లాంఛ్ ఉంటుందనే టీజర్ వీడియోలను షియోమి ఇండియా ఎండీ మనుకుమార్ జైన్, రెడ్‎మి బిజినెస్ లీడ్ స్నేహ తిన్‎వాల ట్వీట్ చేశారు. టీజర్ వీడియోలో నూతన స్మార్ట్‎ఫోన్‎ల గురించి నిర్ధిష్ట వివరాలను వెల్లడించలేదు. ఇక బుధవారం కంపెనీ లాంఛనంగా ప్రకటన చేయనుండటంతో రెడ్‎మి నోట్ 10 సిరీస్ వివరాలపై కొంత స్పష్టత రానుంది.