అమరావతి: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల విధుల నుంచి తొమ్మిది మంది అధికారులను తప్పిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఇద్దరు కలెక్టర్లు, ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు ఉన్నారు. ఈమేరకు తప్పించిన అధికారుల వివరాలను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఎస్ఈసీ లేఖ ద్వారా పంపించారు.
వివరాలు:
గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, తిరుపతి అర్బన్ ఎస్పీ.
పలమనేరు, శ్రీకాళహస్తి డీస్పీలు
మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలు