బోడ సునిల్ కు రేపల్లె శ్రీరంగనాథ్ ఆర్ధికసాయం 

వరంగల్ అర్బన్ జిల్లా : తెలంగాణ వచ్చి 7 యేండ్లు గడిచినా, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగకపోవడం సిగ్గుచేటని వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రేపల్లె శ్రీ రంగనాథ్ విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం చలగాటమాడుతోందని ఆయన మండిపడ్డారు. మహబూబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ పరిధిలోని రామ్ సింగ్ తండా నివాసి బోడ సునీల్ అనే విద్యార్ధి నిన్న కేయూ వద్ద ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. పోలీస్ శాఖలో ఉద్యోగం పొందాలనే ఆకాంక్షతో కష్టపడి చదివినా, నోటిఫికేషన్లు రాక , నిరుద్యోగంతో అల్లాడుతున్నానంటూ బాధిత విద్యార్ధి బోడ సునీల్ పురుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బాధాకరమని శ్రీ రంగనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బోడ సునీల్ ను ఆయన పరామర్శించారు. బోడ సునిల్ ఆరోగ్య పరిస్థితిపై అతని కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నాడు. మెరుగైన వైద్యం అందించాలని ఎంజీఎం వైద్యులకు శ్రీరంగనాథ్ సూచించారు. అనంతరం బోడ సునిల్ కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం చేశారు. బాధితుడు బోడ సునిల్ ను పరామర్శించిన వారిలో రేపల్లె శ్రీ రంగనాథ్ తో పాటు నిఖిల్ , సాయినాథ్, అఫ్రోజ్ , విజేందర్ లు ఉన్నారు .

ads