పుష్కరఘాట్ ఘటనపై ప్రజాప్రతినిధుల దిగ్భ్రాంతి

నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్ జిల్లా పోచంపాడు పుష్కరఘాట్ దగ్గర గోదావరి నదిలో ఆరుగురు మృతి చెందడంపై పలువురు ప్రజాప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత , రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గోదావరిలో స్నానానికిగాను నదిలో దిగి దురదృష్టవశాత్తు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ఎమ్మెల్సీ కవిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.

ads

ఖమ్మం పర్యటనలో ఉన్న మంత్రి వేముల విషయం తెలిసిన వెంటనే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని మంత్రి కోరుకున్నారు.