ఆర్ఎస్ స్థానంలో రోనాల్డ్ రాస్ కు బాధ్యతలు

కరీంనగర్ జిల్లా : రాష్ట్ర గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం, మంగళవారం ఆయనను విధుల నుంచి రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్ కు సర్కార్ అదనపు బాధ్యతలు అప్పగించింది.

ads