రైతు భరోసా యాత్రలో నాయిని

నాగర్​ కర్నూల్​ జిల్లా: కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ‘రాజీవ్ రైతు భరోసా యాత్ర’ నాగర్​ కర్నూల్​ జిల్లా ఊర్కొండ పేటలో జరుగుతుంది. ఈ యాత్రలో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ , టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, కాంటెస్టెడ్​ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య, టీపీసీసీ కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మహమ్మద్ ఆయుబ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్ యాదవ్, చక్రాల రఘు, వరంగల్ వెస్ట్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట పవన్, బొల్లం పవన్, అనిరుధ్, డీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.